ఎన్నికలొస్తేనే ఆ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు : భూమా అఖిల ప్రియ

0

ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక వైకాపా నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎసార్సీపీ నాయకులకు ఎన్నికలు సమీపించటంతో గ్రామాల్లో తిరుగుతున్నారని ,ఎన్నికల ముందు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు .

ప్రతిపక్ష నాయకులు నియోజక వర్గంలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారని చగలమర్రిలో నిరుపేదలకు పంపిణి చేయటానికి సిద్ధం చేసిన ఇంటి స్థలాలను పంపిణి చేయకుండా ఈ స్థలాల పంపిణీపై కోర్టులో కేసువేశారని ఆమె అన్నారు. అలాగే రైతులకు జలసిరి పథకం కింద మంజూరైన వ్యవసాయ బోర్లను వేయనీయకుండా అడ్డుకున్నారని దింతో రైతుల పంటలు ఎండి పోతున్నాయని భుమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి మాజీ ఎంపిటీసీ సభ్యరాలు ముంతాజ్ ,ఆమే భర్త మాజీ సింగల్ విండో డైరెక్టర్ ఖాదర్ లతో పాటు మరో పది మంది భుమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.