చిత్తూరు జిల్లా టీడీపీలో భ‌గ్గుమ‌న్న అసంతృప్తి జ్వాల‌లు

0

చిత్తూరు జిల్లాలో తెలుగు త‌మ్ముళ్లు మ‌ధ్య అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. తాము మ‌ద్దతు ప‌లికే నాయ‌కుడికి టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంపై పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీకి కేటాయించ‌కపోవ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

పార్టీ అధిష్టాన నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ గాంధీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న కృష్ణాపురం జలాశయ అధ్యక్షుడు ఎలవర్తి చంద్రశేఖరరాజు ,చేజర్ల గురువర్మ, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి మునికృష్ణ, బూత్ కన్వీనర్ మండల సర్పంచ్ అధ్యక్షులు కుప్పయ్య , పట్టణ మాజీ సర్పంచ్ కోమల దామోదరంలు ప‌ద‌వుల‌కు ,పార్టీకి రాజీనామా చేశారు.