జ‌గ‌న్‌కు ఓటేస్తే మార్పు కాదు.. మ‌ర‌ణ‌శాస‌న‌మే..

38
ap chandraabu , ys jagan.
ap chandraabu , ys jagan.

ప్ర‌తిప‌క్ష నేత వై ఎస్ జ‌గ‌న్‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు . ఉండవల్లిలోని ప్రజా వేదికలో మాట్లాడిన సీఎం.. మార్పుకోసం ఓటేయాలని జగన్‌ అంటున్నారని, కాని ఆయనకు ఒక్క ఓటు వేసినా అది మరణ శాసనమే అవుతుందని ధ్వ‌జ‌మెత్తారు. నేరాలు చేయడం, వాటి నుంచి తప్పించుకోవడంలో జ‌గన్‌ది మాస్టర్‌ మైండ్ అనీ., ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకే వస్తాయని అన్నారు. నేరాల‌కు సంబంధించి క్రైమ్‌ మాస్టర్‌ అవార్డు జగన్‌కే దక్కుతుందని సీఎం ఎద్దేవా చేశారు.

జ‌గ‌న్ చేస్తున్న నేరాల మ‌రియు కుట్ర‌ల నుంచి తప్పించుకునేందుకు వీలుగా కేసీఆర్‌, మోదీ కాపలాదార్లుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని దుయ్యబట్టారు. మీ భవిష్యత్తు- నా బాధ్యత అని ప్రజలకు తెదేపా భరోసా ఇస్తుంటే, జగన్‌ మాత్రం నా భవిష్యత్తు- మీ బాధ్యత అంటున్నార‌ని అన్నారు. తెదేపాలో టికెట్లు రావనుకున్న వారందరినీ పిలిచి వైకాపాలో చేర్చుకుంటున్నారని, వారికి చివరకు బురద పూసి పంపిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాగిన చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు.. తాను చెడిందే కాకుండా ఏపీని కూడా చెడగొట్టాలని జగన్‌ చూస్తున్నారన్నారు. ‘దొంగ వ్యాపారాలు, బోగస్‌ షేర్లు, షెల్‌ కంపెనీలు, ఫెమా ఉల్లంఘన… ఇలా చెప్పుకుంటూ పోతే ఆయ‌న చేసిని నేరాలకు అంతేలేదని అన్నారు. ఇక‌ ఇప్పడు రాజకీయంలోనూ నేరాలు చేసే విధంగా … లక్షలాది ఓట్ల తొలగించాలనే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, 9 లక్షల ఫామ్‌-7 దరఖాస్తులు ఈసీకి పంప‌డం దేశ చరిత్రలో ఏనాడు చూడ‌లేదంటూ చంద్రబాబు ప్రశ్నించారు.