పాపానికి పరిహారంగా తిరుపతి వెళ్ళిన జగన్..యామిని చౌదరి..

0

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధికార ప్రతినిథి యామిని చౌదరి విమర్శలు చేశారు.. పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై యామిని చౌదరి మాట్లాడుతూ జగన్ చేసిన పాపాలకు ప్రాయచ్చిత్తంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని ఆమె అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ లెటర్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.. ప్రధాన ప్రతిపక్ష నేత, దివంగత రాజశేకర్ రెడ్డి కుమారుడనే అహంకారంతోనే అయన లెటర్ ఇవ్వలేదని ఆమె అన్నారు. ఎలాగయినా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో మీరు పాదయాత్ర చేశారు, కానీ ఆ పాదయాత్రను ప్రజలెవ్వరు హర్షించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. నవరత్న హామీలు ఎలా ఇస్తారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండా వాటిని ఇచ్చారని అని ఆమె దుయ్యబట్టారు. మీరు ప్రవేశ పెట్టిన నవరత్నాలు అమలు చెయ్యాలంటే బడ్జెట్ ఎంత ఉండాలో తెలుసా అని ప్రశ్నించారు.