మా గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేరు : బాల‌కృష్ణ

0

భవిష్యత్తులో హిందూపురాన్ని మరో బెంగళూరు నగరంలా అభివృద్ది చేసి చూపిస్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు…. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ వేసేందుకు హిందూ పురం వ‌చ్చిన ఆయన, సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి భారీ ర్యాలీ నీర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఈ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు తయారయ్యాయని మండి ప‌డ్డారు.

తిరిగి అధికారంలోకి రానున్నది టీడీపీయేనని అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు సాధిస్తామ‌ని నమ్మకముందని బాలకృష్ణ అన్నారు…తెలుగు దేశం అభ్య‌ర్ధుల గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని .. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు…ఈ ర్యాలీలో అభిమానులు కార్య‌క‌ర్త‌లు, తెలుగు దేశం నాయ‌కులు భారీగా పాల్గొన్నారు….