రానున్న ఎన్నికల్లో గెలుపు టీడీపీ దే.. మంత్రి పరిటల సునీత

0

అనంతపురం జిల్లాలో నిర్వహంచిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు . ఈ కార్యక్రమంలో భాగంగా గత పదిరోజులు జన్మభూమి కార్యక్రమంలో నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం చంద్రబాబు చిత్ర పటం ముందు కొత్త జంటలకు వివాహం జరిపించారు.

ఈ సందర్బంగా మంత్రి సునీత మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి లోటు బడ్జేట్ లో వున్న రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘణత చంద్రబాబుకు దక్కుతుందని ఆమె అన్నారు. రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న పెన్షనర్లకు ప్రతినెలా ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రెండింతలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2019 లో జరుగనున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని జోష్యం చేప్పారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారనే ధీమాను వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజక వర్గంలో తమ గెలుపు వైకాపా నేతలకు అడ్డుకోలేరని, ఎవరెన్ని చెప్పిన ప్రజలు తమ వైపు ఉన్నారనే ధీమాను వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజక వర్గ ప్రజలకు గతంలో ఎన్నడు లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అభివృద్ధి అందించానని మంత్రి ప్రజలకు గుర్తుచేశారు.