ఈ రోజు విడుద‌ల కానున్న‌ లోక్‌స‌భ టీడీపీ అభ్య‌ర్ధుల జాబితా.

31
andrapradesh ,tdp party.
andrapradesh ,tdp party.

రాబోయో ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పోటీ చేయ‌బోయే అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను విడుద‌ల చేసింది. అదే విధంగా లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితాను కూడా వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంది. ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగతా రెండు స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక త్వరలోనే కొలిక్కి రానుంది. 15 మంది సిట్టింగ్ ఎంపీల్లో 8 మంది మాత్రమే టీడీపీ నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. అయితే ఈ రోజు ప్ర‌క‌టించ‌బోయే లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితాలో.. 20 మంది పేర్లు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. వారిలో..

శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు

విజయనగరం – అశోక్ గజపతిరాజు

అరకు – కిషోర్ చంద్రదేవ్

అనకాపల్లి – ఆడారి ఆనంద్

కాకినాడ – చలమలశెట్టి సునీల్

అమలాపురం – హర్షకుమార్

రాజమండ్రి -మాగంటి రూప/ముళ్లపూడి రేణుక

ఏలూరు మాగంటి బాబు

విజయవాడ – కేశినేని నాని

మచిలీపట్నం – వంగవీటి రాధా / కొనకళ్ల నారాయణ

గుంటూరు – గల్లా జయదేవ్

నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు

బాపట్ల – తెనాలి శ్రావణ్ కుమార్

ఒంగోలు – శిద్దా రాఘవరావు

నెల్లూరు – బీదా మస్తాన్ రావు

కర్నూలు – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

కడప – ఆదినారాయణ రెడ్డి

రాజంపేట – సాయి ప్రతాప్ / శ్రీనివాసరెడ్డి

అనంతపురం – జెసి పవన్

హిందూపురం – నిమ్మల కిష్టప్ప

చిత్తూరు – శివ ప్రసాద్

తిరుపతి – పనబాక లక్ష్మి.