ప‌చ్చ కండువా క‌ప్పుకున్న వంగ‌వీటి రాధా.

23
vangaveeti radhajoin in tdp party.
vangaveeti radhajoin in tdp party.

వంగవీటి రాధాకృష్ణ, ఈ రోజు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రాధా ప‌చ్చ‌ కండువా కప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వంగవీటి కుటుంబం ఒక చరిత్ర కలిగినదని, రాధా ఓ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. రాజకీయం, పదవుల కంటే తన తండ్రి ఆశయాల సాధనే రాధాకు ముఖ్యమని చంద్ర‌బాబు అన్నారు. పేదలకు పట్టాలివ్వాలని తన తండ్రి ఆకాంక్షించారని, తన పదవి కంటే తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే ముఖ్యమని భావిస్తున్న రాధాను, ఆయ‌న కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో వంగ‌వీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు. తనను తమ్ముడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడవలేదా ? అని ప్రశ్నించారు. అనేకమంది ఇతర నాయకులతో కలిసి ఏపీని ఇబ్బందిపెట్టాలని జగన్ చూస్తున్నారని రాధా విమర్శించారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ మారితే క‌నీసం మరోసారి ప్రతిపక్ష నేతగా అయినా ఏపీ ప్రజలు జగన్‌కు అవకాశం ఇస్తారని వంగవీటి రాధా అన్నారు.