నేను దోషినని తేలితే పులివెందులలో కాల్చి చంపండి. సతీష్.

0

కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కు గురి కావడం కడప రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో నిలుస్తున్న సతీష్ కుమార్ రెడ్డి తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.

జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న వివేకా మృతి పట్ల సంతాపం తెలిపేందుకు జిల్లా టీడీపీ నుంచి ఎవరి పోవాలని నిర్ణయం తీసుకునే లోపే తమపై అభాండాలు వేశారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి మృతిని నీచమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, తో పాటుగా తను కలిసి హత్య చేశారని వైకాపా నేతలు మాట్లాడటం తగదని ఆయన అన్నారు.

నిజానికి తామే దోషులుగా రుజువైతే పులివెందుల నడిరోడ్డుల్లో గన్ తీసుకోని కాల్చేయండని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కొందరు వైకాపా నేతలు తనని అనవసరంగా వారి రాజకీయ స్వార్థం కోసం ఈ హత్య కేసులోకి తనని లాగుతున్నారని ఆయన ఆరోపంచారు. తనకు ఈ హత్యకు ఎలాంటి సంబందం లేదని తెల్చి చెప్పారు.