రూ.5 భోజన కేంద్రాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.

1

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మర చేశారు. పోలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మార్చి 20 రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజనంపై విమర్శలు చేశారు., పేదలను, కార్మికులను, మధ్యతరగతి కుటుంబీకులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్రంలో ‘అన్న’ క్యాంటీన్లు పెట్టామని చెప్పారు.

ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి క్యాంటీన్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. “హైదరాబాద్ లో రోడ్ల పక్కన భోజనాలు పెట్టారు, జనాలేమైనా బిచ్చగాళ్లా?” అంటూ వ్యాఖ్యానించారు. తాము పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలుగుదేశాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రాభివృద్ధికి కృషి చెయ్యాలని ఓటర్లను బాబు కోరారు.