అవకాశం ఇస్తే ప్రజల రుణం తీర్చుకుంటా : వైసీపీ నేత భూమాన

65
ap, ycp leader bhumana karanakar reddy.
ap, ycp leader bhumana karanakar reddy.

చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని 36వ డివిజన్ పరిధిలో వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా అనంతవేదికి చెందిన సుమారు 100మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి భూమాన ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని సామాజక వర్గ ప్రజలను కలుపుకొని ముందుకు పోతానని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రజలు బలపరిస్తే తిరుమల, తిరుపతి ప్రజల కష్టాలను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు , కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు.