పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం.

0

జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల‌ను, విధివిధానాలు, కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సెక్రెటరీ లోకం మాధవి అన్నారు. జిల్లాలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ…ప్ర‌స్తుతం పార్టీలో ఉన్నవారు, వ‌చ్చే వారు యువ‌తేజాలు మ‌రియు రాజకీయాల్లో కీల‌క‌మైన మార్పు కోరుకొనేవార‌న్నారు. యువ ర‌క్తంతో., ఉద్ధండుల అనుభ‌వాల‌తో పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.