విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తు వినుత్న నిరసన..

0

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని ఆవేధన వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వినుత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా జేఏసీ నాయకులు విశాఖపట్నం రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఎదుట భోగి మంటలు ఏర్పాటు చేసి, విభజన చట్టంలో ఉన్న 13వ షెడ్యూల్ పత్రాల కాపీలను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విశాఖ కు రైల్యేజోన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటిస్తు మంత్రి గంట శ్రీనివాసరావు హజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్టాడుతూ … రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు బీజేపీ ఎంపీ హరిబాబు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారని మంత్రి అన్నారు. కేంద్రానికి చిత్త శుద్ది ఉంటే ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ బిల్లులో రైల్యే జోన్ ప్రవేశ పెట్టి, వెంటనే నిధులు విడుదల చేయాలని మంత్రి గంట శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.