విశాఖలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు..

0

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి ఆరవ విడుత కార్యక్రమాలు నేటిలో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంతో పాటు సంక్రాంతి పండుగ రావడంతో విశాఖ జిల్లా అధికారులు “సంక్రాంతి సంబరాలు” ల పేరుతో వుడా చిల్డ్రన్ ధియేటర్ లో వేడులకు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సాంప్రదాయాలకు కొనసాగింపుగా జిల్లా యంత్రాంగం నిర్వహించిన వేడుకల్లో అధికారులు ఉత్సాహాంగా పాల్గోని సంబరాలకు ఫుల్ జోష్ తీసుకొచ్చారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గోని దిస్సానృత్యాలతో అదరగోట్టారు.చెక్కబజనతో ఉల్లాసంగా గడిపిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోలాటాలు ఆడారు. పిండి వంటల రుచులు … గంగిరెద్దుల విన్యాసాలు … ఇంద్రదనస్సు తలపించే చూడు ముచ్చట గొలిపే రంగవల్లలతో ఇలా విశాఖ సాగర తీరంలో సరికొత్తశోభను తీసుకొస్తూ సంక్రాంతి సంబరాలు ఘణంగా జరిగాయి.