పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వైఎస్ జగన్

0

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న అనంతరం మతాలకు అతీతంగా వివిధ ప్రార్థనా మందిరాలు, దేవాలయాలను సందర్శించుకుంటున్నారు. తాజాగా కడప జిల్లా పులివెందుల లో ఉన్న సీఎస్ఐ చర్చికి కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా చర్చి పాస్టర్ ప్రార్థనల అనంతరం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు.

తమ అభిమాన నాయకుడు జగన్ తన జిల్లాలో 14 నెలల తరువాత అడుగు పెట్టడంతో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నేత చర్చికి వస్తున్నారని తెలుసుకోని ముందుగా అక్కడకు చేరుకోని జగన్ కు ఘనస్వాగతం పలికారు.