రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా లంచం లంచం..కానీ

0

సీఎం చంద్ర‌బాబు గ్రామాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల‌ను ప‌క్క‌న‌బెట్టి జ‌న్మ‌భూమి అనే మాఫియాను రంగంలోకి దించార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ ఆరోపించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొయ్య‌ల గూడెంలో వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మాట్లాడుతూ ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు నడిచి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్‌లో తన పాదయాత్రను ముగించిన‌ట్లు తెలిపారు.

ఈ పాద‌యాత్ర‌లో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నాన‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు 13 జిల్లాలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు తీసేశార‌ని ఆరోపించారు.అంతేకాదు గ్రామాల్లో ఉన్న జ‌న్మ‌భూమి కమిటీ స‌భ్యులు లంచాల పేరుతో ప్ర‌జ‌ల్ని పీక్కుతిన్నార‌ని అన్నారు. ఏపని కావాల‌న్నా లంచం, ఆఖ‌రికి బాత్ రూం నిర్మాణం కావాల‌న్నా లంచం అడుగుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీసంక్షేమ ప‌థ‌కం ప్ర‌జ‌లకు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.