స‌ర్వేల పేరుతో వైసీపీ ఓట్ల‌ను తొల‌గిస్తున్నారు.

0

సర్వేల పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొల‌గిస్తుంద‌న్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి . ఫిబ్రవరి 9 న మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీ త‌ప్పుడు వాగ్ధానాల‌తో ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెడుతుంద‌న్నారు.

సీఎం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారినే రాష్ట్రంలో కీల‌క పదవుల్లో ఉంచార‌ని ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. పోలీస్ శాఖ , రెవిన్యూ శాఖ‌, ఎన్నిక‌ల శాఖ ఇలా ప్ర‌తీ యంత్రాంగంలోనూ బాబు మనుషులే ఉన్నార‌ని బుగ్గన అన్నారు. ఏపీలో దాదాపు 59 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని.. అవ‌న్నీ తెదేపా కుట్ర‌లోని భాగ‌మే ఆయ‌న అన్నారు.