పవన్ కళ్యాణ్ వైసీపీ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు.. పార్ధసారథి

0

వైసీపీ నాయకులు పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును టీడీపీ ప్రభుత్వం నీరుగార్చేలా వ్యవహరించిందని ఆరోపించారు. కేసుకు సంభందించిన పత్రాలను ఎన్ఐఏ అధికారులకు ఇవ్వడానికి విశాఖ పోలీసులు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి అది కేంద్ర బలగాల పొరపాటని దాడి సమయంలో కేంద్రంపైకి తప్పు తోసేసిన టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం విచారణను కేంద్ర సంస్థ అయినా ఎన్ఐఏ చేపడుతుంటే వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. ఇక పవన్ గురించి మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు వైసీపీకి ఎదో ఒప్పందం కుదిరిందని జనసేన అధినేత ఆరోపించడంపై పార్ధసారథి మండిపడ్డారు. ఇంతవరకు జగన్ కెసిఆర్ కలిసింది లేదని అన్నారు. ఒక్క సారి మాత్రమే శుభాకాంక్షలు తెలుపడానికి ఫోన్ లో మాట్లాడినట్లుగా పార్ధసారథి తెలియచేసారు..