వివేక హత్య కేసులో “ఊహించని” మలుపు.

0

వైయస్ఆర్ పార్టీ సీనియర్ నేత, జగన్ చిన్నాన్న అయిన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు .అనుమానితులుగా భావిస్తున్న ఎర్ర గంగి రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.పోలీసులు గత నాలుగు రోజుల నుండి రహస్య ప్రాంతంలో గంగి రెడ్డిని విచారణ చేస్తున్నారు..వివేకకు అత్యంత సన్నిహితులుగా ఉండే గంగి రెడ్డి,పరమేశ్వర్ రెడ్డి కలసి హత్య కు ప్లాన్ చేసిట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

వివేకాకు వీరికి మధ్య ఎర్పడిన భూ వివాదమే హత్యకు కారణమని తెలుస్తుంది.బెంగుళూరులోని ఓ భూ వివాదంలో వివేకాకు గంగిరెడ్డికి మద్య విభేదాలు ఎర్పడ్డాయి. వివేక హత్యకు దాదాపు రోజుల ముందునుంచే రిక్కి నిర్వహించినట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. 125 కోట్ల రూపాయల సెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్పడిన వివవాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.