యాత్ర సినిమా దర్శకుడికి నా అభినందనలు. కోడలి నాని

0

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా అందరి గుండెలను తాకిందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. వైఎస్ఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆయ‌న పాద‌యాత్ర కీల‌క మ‌లుపు అని అన్నారు.

ఆయ‌న సీఎం అయిన త‌ర్వాత ప్ర‌వేశ‌పెట్టిన అనేక సంక్షేమ ప‌థ‌కాలతో ఎంతో మంది ప్ర‌జ‌లు బాగుప‌డ్డార‌ని, అటువంటి అంశాల‌న్నీ సినిమాలో చ‌క్క‌గా చూపించార‌ని నాని మీడియాకి తెలిపారు. ఈ సినిమాను ఇంత‌ అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి.వి.రాఘవ్, చిత్ర‌ యూనిట్ కు ఆయ‌న అభినందనలు తెలిపారు