సోమిరెడ్డి వలన టీడీపీ పది స్థానాలు కోల్పోయే ప్రమాదం :- ఆదాల

309
aadala prabhakar reddy , somi reddy.
aadala prabhakar reddy , somi reddy.

 నెల్లూరు జిల్లా లో టీడీపీ రూరల్ టికెట్ పొంది అనంతరం ఒక్క రోజులో రాజకీయ ల్లో పార్టీ మారిన ఘనత కేవలం ఆదాల ప్రభాకర్ కు సొంత .. ఇక టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయనకు వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేయడం ఇప్పుడు చర్చనియ అంశంగా మారింది. ఇదంతా పక్కన బెడితే వైసీపీ నెల్లూరు అభ్యర్థి ఆదాల పార్టీ కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానపున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ సోమిరెడ్డి వల్ల పది స్థానాలు ఓడిపోతుందని ఆయన జోష్యం చెప్పారు. గతంలో తాను ప్రజలకు చేసిన సేవనే తనని ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికి కూడా గెలిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తన అభిమానులు , వైసీపీ కార్యకర్తలు గెలుపు కోసపం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.