ఎన్నికల ముందు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న “యాత్ర” మూవీ

0

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ను కథాంశంగా తీసుకోని దర్శకుడు మహి విరాఘవ్ తీసిన చిత్రం “యాత్ర”. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ముమ్ముట్టి నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా విశాఖ జిల్లాలో వైసీసీ నేతలుసంబరాలుచేసుకున్నారు.వైఎస్సార్ రాజకీయ జీవితంలో దాగిఉన్నఅంశాలు వైసీపీ అభిమానులను పలకరించడంతో విశాఖలో వైసీపీనేతలుసందడిచేశారు.విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త రమణమూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గోని “యాత్ర” చిత్రాన్ని వీక్షించారు.