కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించిన జగన్

0

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదిన తన పాదయాత్రను ఇచ్చాపురంలో ముగించిన అనంతరం తన మొక్కులు చెల్లించుకుంటున్నారు.. ఇచ్చాపురం నుండి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ అక్కడ నుండి కడపలోని అత్యంత ప్రసిద్దంగా భావించే “అమీన్ పీర్ దర్గా” (పెద్ద దర్గా) ని సందర్శించి తనమొక్కును చెల్లించుకున్నారు. దర్గాలో దేవుళ్ళకు దువ్వా, చర్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ తన సొంత జిల్లాకు 14 నెలల తరువాత రావడంతో వైకాపా నేతలు . జగన్ అభిమానులు పెద్ద ఎత్తును జగన్ కు స్వాగతం పలికారు.