వైఎస్ వివేకా భౌతిక కాయానికి నివాళుల‌ర్పించిన వైఎస్. జ‌గ‌న్

32
kadapa, ys jagan mohanreddy.
kadapa, ys jagan mohanreddy.

మాజీ మంత్రి, తన చిన్నాన్న వివేకానంద మరణవార్త తెలిసి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల చేరుకున్నారు. పులివెందులలోని వివేకా నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ హత్య ఎలా జరిగిందనే అంశంపై కుటుంబ సభ్యులను జగన్‌ ఆరా తీస్తున్నారు. కడప ఎస్పీ, కర్నూలు డీఐజీ జగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

స్నానాల గదిలో వివేకానంద రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా.. ఆయన సహాయకుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో రిమ్స్‌ వైద్యులు తేల్చడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివేకా హత్యతో పులివెందులలో విషాదం నెలకొంది. ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేసుకున్నారు. శనివారం వివేకా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.