భావితరాల భవిష్యత్ కోసం “జన జాగృతి పార్టీ” స్థాపించా : కొత్త పల్లి గీత

53
araku mp kottapalli geetha.
araku mp kottapalli geetha.

విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్త పల్లి గీత పాయకరావుపేట లోని ద్వారక హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం, రాజకీయ ప్రక్షాళన కోసం, రాజకీయ దోపిడీ నుండి సామాన్యుడిని కపాడటమే లక్ష్యంగా “జన జాగృతి పార్టీ”ని స్థాపించానని అన్నారు. మహిళా ప్రాధాన్యంగా జన జాగృతి పార్టీ సాగుతుందని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ , రాజకీయ వ్యవస్థలన్నీ అవినీతిమయని తెలిపారు. టీడీపీ హయాంలో ఒక్క నారా లోకేశ్‌కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని ఆమె ఎద్దెవా చేశారు. ప్రజా దేవాలయమైన అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కులాధిపత్యంతోనే రాష్ట్రంలో రెండు కుటుంబాల చేతుల్లో పాలన సాగుతోందని కొత్తపల్లి గీత ఆరోపించారు.

జనజాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తుందని ఆమె స్పష్టంచేశారు. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా “జన జాగృతి పార్టీ ” ముందుకు పోతుందని ఆమెు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు , అభిమానులు తదితరలు పాల్గొన్నారు.