పులివెందులలో అడుగుపెట్టిన జగన్….

0

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14 నెలల తర్వాత పులివెందులలో అడుగు పెట్టాడు. ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి జనవరి 10 న తిరుపతి దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. జనవరి 11 ఇడుపులపాయ వెళ్లి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళ్లు అర్పించిన జగన్ అటు నుండి కడపకు వెళ్లాడు, ఆ తర్వాత జనవరి 12న అమీన్ పీర్ దర్గాను దర్శించుకొని అటు నుండి పులివెందులకు వెళ్లారు. పులివెందులలో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చాలా కాలం తర్వాత పులివెందులకు రావడంతో ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చారు.