ఆదోనిలో నేను, అమరావతిలో జగన్.

0

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి తన స్వగృహం నుంచి కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకతో పాటు ఇతర నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయల్దేరి ఆదోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి కూడా ఆదోనిలో ఘన విజయం సాధిస్తామని, రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని అన్నారు. కచ్చితంగా ఎన్నికల అనంతరం కాబోయే సీఏం జగన్ అన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.