జేసీ తనయుడి కోసం “పట్టు సడలించిన ” జగన్

1

అనంతపురం జిల్లా లో వైకాపా గత ఎన్నికల్లో పెద్ద ప్రాధాన్యత చూపక పోయినా 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అంతే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న జేసీ తన ఆధీనంలో ఉన్న నాలుగు నియోజక వర్గాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డవే .. మొదటి నుంచి జిల్లాలో టీడీపీ కి పట్టు ఉన్నప్పటికి కూడా జేసీ రాకతో మరింత బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి జేపీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి జిల్లా సీనియర్ నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి పోటీ చేశారు. వీరి మధ్య దాదాపుగా ఉత్కంఠ పోటీ కోనసాగగా చివరకు జేసీ విజయం సాధించారు.తాజా రాజకీయ పరిణామాలు చూసుకుంటే అనంతలో యువనాయకులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక అనంతపురం ఎంపీ స్థానం ను టీడీపీ అధిష్టానం మాజీ ఎంపీ జేసీ తనయుడు జేసీ పవన్ కు కేటాయించిన విషయం తెలిసిందే.. కాగా ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ బలమైన రాజకీయ నాయకులు ఉన్న కూడా ప్రజలకు తెలియని ఓ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం కాసింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తలారి రంగయ్యను జగన్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై జిల్లా సీనియర్ నాయకుల్లో సైతం కుసుమంత అనుమాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం జేసీ తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం జగన్ తన పట్టు సడలించాడనే వార్తలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. మరి ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నాయకులు వైసీపీ కి పార్టీకి పరోక్ష మద్దతు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే నిజమైతే ఎంపీ సీటు పట్టు వదిలి ఎమ్మెల్యే సీట్లకు జగన్ గాలం వేసినట్లే అని కూడా జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేటి రాజకీయాల్లో వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు ఎన్ని అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలవరకు వేచిచూడాల్సి ఉంది .