జమ్మలమడుగు నియోజక వర్గంలో వైసీపీ నేతలకు చేదు అనుభవం

0

కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం పరిధిలోని సుగుమంచి పల్లి, ధర్మాపురం, గురిగనూరు గ్రామంలో “రావాలి జగన్ కావాలి జగన్ ” కార్యక్రమంలో పాల్గొనడానికి వెలుతున్న వైసీపీ నాయకుల కాన్వాయిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని , రాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేవలం ఒక్క వాహనంలో మాత్రమే గ్రామం లోపలికి వెళ్లాలని పోలీసులు కోరారు.

ఈ సందర్భంగా జమ్మలమడుగు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి సుదీర్ రెడ్డి, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులతో వాగ్వవాదానికి దిగారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా సుగుమంచిపల్లిలో పర్యటించిన నాయకులకు మరో చేదు అనుభవం ఎదురైంది. తమ ఓటు ఆది నారాయణ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడే అని గ్రామప్రజలు ఖరాఖండిగా చెప్పడంతో వైసీపీ నేతలు కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రచారం సందర్భంగా కొంతమంది యువకులు అవినాష్ రెడ్డి ఆద్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి , స్థానిక నాయకులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.