వైసీపీలో అసమ్మతి సెగ

0

పెద్దపురం నియోజక వర్గం వైయస్ఆర్ పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటుంది. నియోజక వర్గకోఆర్డినేటర్ దవళూరి దొరబాబుకు పార్టీ సీటు కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు,భవిష్యత్ కార్యచరణ పై పెద్దపురంలో ఎర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ చీటికిమాటికి అభ్యర్ధులను మార్చడం సరికాదన్నారు.అనంతరం దొరబాబు మాట్లాడుతూ జగన్ సీయం అయ్యేలా అందరం పనిచేయాలన్నారు. అటుగా ప్రచారం నిర్వహిస్తున్న తోట వాణిని సమావేశానికి ఆహ్వానించి వైయస్ పార్టీ అభ్యర్ధి అయిన తోటా వాణికి అందరం మద్దతు ఇవ్వాలని అన్నారు,కలసి కట్టుగా వాణి విజయానికి పని చేస్తామని హామీ ఇచ్చారు.