60 రోజుల్లో ప్రారంభం కానున్న రాజన్న స్వర్ణయుగం – ఆళ్ల.

0

రానున్న 60 రోజుల్లో రాష్ట్రంలో రాజ‌న్న స్వ‌ర్ణ‌యుగం ఏర్పాటు కావ‌డం త‌థ్య‌మ‌ని వైకాపా జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. వైకాపా తీర్థం పుచ్చుకున్న ఏలూరు న‌గ‌ర మేయ‌ర్ నూర్జహాన్‌, ఆమె భ‌ర్త ఎస్.ఎమ్.ఆర్ పెద‌బాబుతో క‌ల‌సి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న అవినీతి పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని నాని అన్నారు.

ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ న‌వ‌ర‌త్నాలు త‌మ‌కెంతో నచ్చాయ‌ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశంలో అగ్ర‌స్థానంలో ఉంటుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, ఏలూరు ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర త‌మ‌కు స్ఫూర్తి అనీ, వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమ‌ని అన్నారు.వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకుని నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధి ఆళ్ల నాని గెలుపుకు కలిసి పనిచేస్తామని ఈ స‌మావేశంలో అన్నారు.