వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

1

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణనంతరం, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని అయన అభిమానులు, ప్రత్యేక పార్టీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులు మొదలు విద్యార్థులవరకు అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ప్రణాళికలు రచించి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించారు. అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆంధ్రరాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 320 రోజుల్లో సుమారుగా మూడు వేల 600 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు.

పాదయాత్రలో అడుగడుగునా జన నీరాజనాలు అందుకున్న యువనేత జగన్, వాడవాడన పార్టీని బలోపేతం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన అధికారపార్టీని ఎండగడుతూ, రాష్ట్రాభివృధే ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదోవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా, గుంటూరు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు, వైఎస్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీనాయకులు లేళ్లఅప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.