దాస‌రి ఉండుంటే వైసీపీ నుంచి పోటీచేసేవారు

0

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది, ఎన్నికల్లో సీటే లక్ష్యంగా నాయకులంతా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. సహజంగానే ఎన్నికల సమయంలో పార్టీలన్నీ సినీ గ్లామర్ ను వాడుకునేందుకు ఆరాట పడుతుంటాయి, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కూడా సినీ గ్లామర్ కీలకం కానుంది. ఇప్పటికే సినీరంగానికి చెందిన ప‌లువురు వైసీపీలో చేరారు.

తాజాగా దాస‌రి అరుణ్, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా అరుణ్ మాట్లాడుతూ దివంగ‌త ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఉండుంటే వైసీపీ తరుఫున పోటీ చేసేవార‌ని అన్నారు. త‌న‌కు వైసీపీ పార్టీ సిద్ధాంతాలు , ఆశ‌యాలు న‌చ్చి పార్టీలో చేరిన‌ట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాన‌ని అన్నారు.