నన్ను ఓడించడానికి టీడీపీ రూ. 100 కోట్లు ఖర్చు చేస్తుంది. :- అనిల్.

0

నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శ్రీనివాస నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనని రాజకీయాల్లో లేకుండా చేసేందుకు టీడీపీ మంత్రి నారాయణ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మొబైల్ ఫోన్లు, కుంకుమ బరిణెలు పంచేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాజన్న పాలన రాష్ట్రంలో రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జగన్ కు ఒక్క అవకాశమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.