వైఎస్ కుటుంబాన్ని దురదృష్టం వెంటాతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తాత వైఎస్. రాజారెడ్డిని ప్రత్యర్ధులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఆ హత్య ఎవరు చేశారో తెలిసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సౌమ్యుడిగా ఉన్నారు. గొడవులు ఎందుకంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వైఎస్ ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం సృష్టించింది.2009 సెప్టెంబర్ 2 న జరిగిన ఈ ఘటనను అందరు ప్రమాదం అనుకున్నారు కాని రాజకీయాలని దగ్గర నుండి చూసిన వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అంటున్నారు.
సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు
కొద్ది నెలల క్రితం వైఎస్.జగన్ ను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగింది. విశాఖ ఏయిర్‌పోర్ట్‌కు వచ్చిన జగన్‌పై.. అక్కడే ఉన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ రావు.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ ఎడమ చేయి పై భాగాన.. భుజం కింద రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన జగన్ సెక్యూరిటీ.. శ్రీనివాసరావును అడ్డుకోవడంతో.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ముందుగా లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్ కు టీ ఇచ్చిన శ్రీనివాసరావు.. సార్ 160 సీట్లు వస్తాయా అంటూ పలకరించాడు. తర్వాత సెల్ఫీ తీసుకుంటానంటూ.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ పోలీసులు.. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మరోవైపు జగన్‌కు ప్రథమ చికిత్స జరిగిన తర్వాత.. హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఎన్ ఐఏ ఇది ముమ్మాటికి హత్యయత్నామేనని తేల్చింది.
ఇప్పుడు వైఎస్ వివేకానంద మరణం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. ఎంతో సౌమ్యుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన వైఎస్ వివేకానంద రెడ్డిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివేకా భౌతికకాయానికి పోస్ట్ మార్టం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకాది గుండెపోటు కాదని, ఎవరో హత్యచేశారని తేల్చేశారు.