జగన్ ను ఎదురుకోలేక, వాళ్ళ చిన్నానను హత్యచేశారు.

2

వై ఎస్ వివేకానంద‌రెడ్డి మృతి పార్టీకి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని వైసీపీ జిల్లా అధ్య‌క్షులు ఆళ్ల నాని అన్నారు. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ… మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా వైఎస్ వివేకా అనేక మంది అభిమానం పొందారని గుర్తుచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్లు తెలిపారు.

రాజకీయంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేని ప్రత్యర్థులు ఈ విధంగా హత్యకు పాల్పడ్డారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారుతుందని ఆళ్ల నాని ఈ సంద‌ర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప ప్రజల మానప్రాణాలకు రక్షణ ఉండదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నాయకులు గుడిదేశి శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొ