వామ‌ప‌క్ష‌, బీఎస్పీల‌కు 24 సీట్లు కేటాయించిన ప‌వ‌న్

28
andrapradeh, janasenas party pavan kalyan.
andrapradeh, janasenas party pavan kalyan.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ కూడా జట్టుకట్టాయి. నాలుగు పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. పొత్తుల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు ఎంపీ సీట్లను బీఎస్పీకి జనసేన ఖరారు చేశారు. తిరుపతి, బాపట్ల, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాలను బీఎస్పీకి కేటాయించారు. ఈ మూడు సీట్లు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు కావడం విశేషం. అలాగే, 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

అయితే, ఏయే నియోజకవర్గాలు కేటాయించాలనే అంశంపై క్లారిటీ రాలేదు. రెండు పార్టీల నేతలు ఇప్పటికే ఓ సారి చర్చించారు. మరోసారి చర్చించిన తర్వాత ఏయే సీట్లు ఇవ్వాలనే అంశంపై క్లారిటీ రానుంది. అలాగే, సీపీఎంకు జిల్లాకు ఒక సీటు చొప్పున కేటాయించే ప్రతిపాదన ఉంది. ఇటీవల యూపీ వెళ్లిన పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాలని మమతా బెనర్జీ ఆకాంక్షిస్తే.. బెహన్‌జీ ప్రధానమంత్రి కావాలని జనసేనాని అన్నారు.