ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు కేటాయించినకేంద్ర ప్రభుత్వం

0

విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రప్రభుత్వం మోసం చేసిందంటూ టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు తెరదించుతూ, ఏపీకి కేంద్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన నిధుల వివరాలను వెల్లడిస్తూ ఏపీ బీజేపీ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు మించిన సహాయం చేసిందని వారు ఈ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియాజేశారు. ఇందులో ఏ ఏ శాఖకు ఎంత నిధులు విడుదల చేశారు వివరించి చెప్పారు. విద్య వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో విద్యా శాఖకు, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం 7233.4 వేల కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పోలవరం నిర్మాణానికి 100% నిధులను కేంద్రమే ఇస్తుందని వారు వివరించారు. జాతీయ రహదారుల మార్పులు, చేర్పులు, కొత్తగా ఏర్పాటు చేసే జాతీయ రహదారుల కోసం మరియు నవ్యంద్ర అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం రోడ్డు రవాణా శాఖాకు 65 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇచ్చినట్లు వారు తెలిపారు.

పెట్రోలియం మరియు సహజ వాయువు అభివృద్ధికి గాను, పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు, సరికొత్త రిఫైనరీ నెలకొల్పడానికి 48420 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటు మరియు రక్షణ అవసరాల నిమిత్తం 6266.55 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణం క్రింద 1 లక్ష 93 వేల ఇండ్లను కేంద్రప్రభుత్వం నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజ్, స్మార్ట్ సిటీ పథకాల క్రింద ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్మార్ట్ సిటీస్ విశాఖ మెట్రో రైలు వంటి వాటి కోసం 11,588 కోట్లు కోటయించారు. విమానాశ్రయాల మరమత్తులు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం 281 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.. ఇక రైల్వే శాఖలో కొత్త రైల్వే లైన్ నిర్మాణాలు, విజయవాడ తిరుపతి స్టేషన్స్ లో వై ఫై ఏర్పాటు వంటి కార్యక్రమాల కోసం 3808 కోట్లు కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్యం క్రింద 41577. కోట్లు, నక్షలిజం ప్రభావిత ప్రాంతాలలో నూతన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం 357.42 కోట్లను కేటాయించారు. ఆరోగ్య సంక్షేమానికి 640 కోట్ల రూపాయలు, పెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ కోసం 20000 కోట్లను కేంద్రం ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు తెలిపారు.