హారర్ సినిమాతో ప్రేక్షకు ముందుకు వస్తున్న అంజలి…

34
anjali actor
anjali actor

హారర్ చిత్రాల్లో నటిస్తున్న నటిగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అంజలి.. ముఖ్యంగా తను ఒక పక్క కథానాయిగా హీరోల సరసన నటిస్తూనే మరో పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.. ఇక తను కీలక పాత్రల్లో నటించిన చిత్రాలన్ని కూడా హారర్ చిత్రాలే కావడం మరో విశేషం.. తాజాగా ఆమె మరో హారర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే ‘లిసా’. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతవరకు అంజలి నటించిన చిత్రాలకు ఈ చిత్రానికి చాలా వేరియేషన్ ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు.. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.. మరి ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న అంజలి కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందని భావిస్తోందట.. కాగా ఈ చిత్రం వచ్చే నెల 25వ తేదిన క్రిస్మస్ సందర్బంగా విడుదల చేయనున్నారు.