ప‌వ‌న్ కు షాక్ “వైసీపీ”లోకి శ్రీకాకుళం జ‌న‌సేన‌ ఎంపీ అభ్య‌ర్ధి..?

238
ap janasena party, adinetha pavan kalyan.
ap janasena party, adinetha pavan kalyan.

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫస్ట్ షాక్ తగిలింది. ఆ పార్టీ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు పార్టీ మారుతున్నారు. తాజాగా జనసేన ప్రకటించిన నలుగురు ఎంపీ అభ్యర్థుల్లో గేదెల శ్రీనుబాబు కూడా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఐదు రోజుల ముందే ఖరారు చేసింది.

అయితే, ఇప్పుడు ఆయన సడన్‌గా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ తరఫున ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైసీపీ తరఫున శ్రీకాకుళం బరిలో కిల్లి కృపారాణిని దించాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కిల్లి కృపారాణిని కాకుండా అక్కడ గేదెల శ్రీనుబాబుకు అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.