జగన్ కు మద్దతుగా రంగంలోకి విజయమ్మ, షర్మిళా.

0

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో రాజ‌కీయ‌ వేడి మ‌రింత పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే నేత‌లంతా త‌మ‌దైన శైలిలో ప్ర‌చారాల్లో దూసుకుపోతున్నారు. వైసీపీ నుంచి జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లు రోడ్ షోలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ తరపున ప్రచారం చేయడానికి వైయస్ విజయమ్మ, షర్మిళ సిద్దమౌతున్నారు. వీరిద్దరు వేరు వేరు బస్సులతో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం

.ఈ నెల 27 న మంగళగిరి నుండి ఉత్తరాంద్ర ఇచ్చాపురం వరకు షర్మిళ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మెత్తం 10 జిల్లాల్లో దాదాపు 50 నియోజక వర్గాల్లో షర్మిళ ప్రచారం చేయనున్నారు. మరోవైపు వైయస్ విజయమ్మ 40 నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రోజుకు నాలుగు, ఐదు నియోజవర్గాల చోప్పున జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ రకంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైయస్ కుటుంబం ప్రచారానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.