మావోయిస్టుల కాల్పుల‌పై ఏపీ హోంమంత్రి వివ‌ర‌ణ‌..!

6

విశాఖ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగ‌ట్టారు. అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావుపాటు, అర‌కు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. అయితే, ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వెంట‌నే స్పందించిన ఏపీ హోంమంత్రి చిన్న‌రాజ‌ప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ అర‌కులో జ‌రిగిన సంఘ‌ట‌.. చాలా దుర‌దృష్ట‌క‌రం. ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోము ఇద్ద‌రూ కూడా గ్రామ ద‌ర్శిని కార్య‌క్ర‌మానికి డుంబ్రిగూడ మండ‌లం తుటంగి గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో న‌క్స‌లైట్‌లు కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, శివేరి సోము ఇద్ద‌రూ మ‌ర‌ణంచారు.

ఈ సంఘ‌ట‌న‌కు స్పందించి ప్ర‌భుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై సంఘ‌ట‌న ఎలా జ‌రిగింది..? అన్న‌దానిపై విచార‌ణ‌కు అధికారులు అక్క‌డ‌కు పంపించామ‌న్నారు. అయితే, నాలుగ‌న్న‌ర సంవ‌త్స‌రాలుగా ఏజెన్సీ ప్రాంతంలో చుట్టూరా కూడా చ‌త్తీస్‌ఘ‌డ్‌కానీ, ఒడిశా కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాల్లో న‌క్స‌లైట్లు ఉన్నా.. ఏపీలో మాత్రం కంట్రోల్లోనే ఉన్నార‌న్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు సంవ‌త్స‌రాల‌పాటు ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు. కానీ, ఇవాళ ఇలా జ‌ర‌గ‌డం చాలా బాధాక‌ర‌మ‌న్నారు. ఈ సంఘ‌ట‌న ఎలా జ‌రిగింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఇంత మంది ఎలా వ‌చ్చారు..? ఎలా కాల్పులు జ‌రిపార‌న్న విష‌యాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింద‌న్నారు.