మాయావ‌తిని, ప‌వ‌న్ ప్ర‌ధానిని చేస్తారేమో..?

64
ap janasena party adinetha pavan kalyan.
ap janasena party adinetha pavan kalyan.

మాయ‌వ‌తిని ప్ర‌ధానిగా చూడాల‌ని ఉందని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ మాట్లాడుతూ.. మాయావతి చాలా విజన్‌ ఉన్న నాయకురాలు. ఆమెను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాను. ఈ కోరిక నా ఒక్కడిదే కాదు. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. దేశానికి మాయావతిలాంటి మహిళల నాయకత్వం ఎంతో అవసరం. దాన్ని మేం నిజం చేస్తాం. ఇప్పుడు నేను అంటున్న మాటలు భవిష్యత్తులో నిజం కావచ్చు’ అని పవన్‌ అంటుండగా అందుకు మాయ కూడా నవ్వుతూ తలూపారు.