మంత్రి నారాయణపై మండిపడ్డ ఎమ్మెల్యే అనిల్.

0

తెలుగుదేశం పార్టీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవు మండిపడ్డారు. నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన అయన తెలుగుదేశం నాయకులు ఎన్నికల నియమవ్వాలని ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత ప్రజలను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకూడదు అనే నియమాలను తెలుగుదేశం పార్టీ తుంగలో తొక్కిందని అన్నారు.

గత ఐదేళ్లలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణి చేయడానికి మంత్రి నారాయణకు మనసు ఒప్పలేదు కానీ ఎన్నికల ముందు ఓట్లకోసం సైకిళ్ళ పంపిణి చేస్తున్నారని అన్నారు. టీడీపీ అవినీతి చేసింది కానీ అభివృద్ధి మాత్రం చెయ్యలేదని విమర్శించారు. పిల్లలకు సైకిళ్ళు ఇచ్చి తల్లిదండ్రుల ఓట్లకు ఎర వేస్తున్నారని మండిపడ్డారు.