చంద‌మామ‌లో బాబానే క‌నిపించారు.. ఇదిగోండి సాక్ష్యం..!

0

చంద‌మామ‌లో బాబా రూపం. ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. సాక్షాత్తు శిరిడీ సాయిబాబానే చంద‌మామ‌లో క‌నిపిస్తున్నాడంటూ ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇదే విష‌యం ఆ నోటా.. ఈ నోటా ప‌డ‌టంతో కొందరు నిజ‌మా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంత ఉట్టిదేనంటూ మ‌రికొంద‌రు కొట్టిపారేస్తున్నారు. ఇంత‌కీ, ఆ దృశ్యం ఎవ‌రిది..?

సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ ఫోటో గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. చంద‌మామ‌లో శిరిడీ సాయిబాబా ఆకారం క‌నిపిస్తుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారానికి ప‌శ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వాసులు అలెర్ట్ అయ్యారు. నిజ‌మేనా..? క‌నిపిస్తున్న‌ది బాబా బొమ్మేనా అంటూ ఇళ్ల‌లో ఉంటున్న వారంతా చంద‌మామ‌ను చూసేందుకు రోడ్ల‌పైకి వ‌చ్చారు. రాత్రంతా ఆ దృశ్యాల‌ను త‌మ సెల్‌ఫోన్‌ల‌లో షూట్ చేసుకున్నారు.

చంద‌మామ‌లో క‌నిపిస్తున్న‌ది నిజంగా బాబా ఆకార‌మేన‌ని అంద‌రూ విశ్వ‌సిస్తున్నారు. ఇన్నేళ్ల‌లో ఇలాంటి వింత‌ను తామెప్పుడూ చూడ‌లేద‌ని ఇది క‌చ్చితంగా బాబా మ‌హ‌త్య‌మేనంటూ చంద‌మామ‌కు న‌మ‌స్కారాలు పెడుతూ ఇదే స‌మాచారాన్ని బంధువుల‌కు కూడా చేర‌వేశారు. గ‌త నెల గురు పౌర్ణ‌మి నాడు కూడా ఇదే ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. న‌వ‌రాత్రులు చివ‌రి రోజు కావ‌డంతో నిండు పౌర్ణ‌మి రోజు కూడా ఇటువంటి చిత్రం చంద‌మామ‌లో క‌నిపిస్తుండ‌టంతో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తుంటే.. మ‌రో వైపు ఇదంతా ఒట్టిదేనంటూ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫోటో మార్ఫింగ్ అంటూ కొట్టిపారేస్తున్నారు.