అంద‌మైన అమ్మాయి కావాలా..? ఈ ఫోటోలో ఎవ‌రు కావాలో సెలెక్ట్ చేసుకోండి.!

26

అంద‌మైన అమ్మాయి కావాలా..? ఈ ఫోటోలో ఎవ‌రు కావాలో సెలెక్ట్ చేసుకోండి.! అలా డ‌బ్బు చెల్లిచండి.. ఇలా అమ్మాయి వ‌చ్చేస్తుంది. క‌త్తిలాంటి అమ్మాయిల ఫోటోలు పంపి మాయ చేస్తారు. ఆ మాయ‌లో ప‌డ్డారో.. ఇక అంతే. క‌ట్టు బ‌ట్ట‌లు మాత్ర‌మే మిగిలిపోతాయి. అలాంటి ఓ ముఠా గుట్టు ర‌ట్ట‌యింది. ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్న ఓ వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక క‌దిలింది. దేశ వ్యాప్తంగా ఆ ముఠా చేస్తున్న దందా చివ‌ర‌కు వెలుగులోకి వ‌చ్చింది.

ఆయా డేటింగ్ వెబ్‌సైట్ల‌లో యువ‌కుల‌ను ఆక‌ర్షించే విధంగా గూగుల్‌లోనే డౌన్‌లోడ్ చేసిన అంద‌మైన అమ్మాయిల ఫోటోల‌ను అప్‌లోడ్ చేసేవారు. తొలుత మెంబ‌ర్‌షిప్ కోసం రూ.1,050లు ఫీజు క‌ట్ట‌మంటారు. రిజిస్ట్రేష‌న్, సర్వీస్ జీఎస్టీ, అకౌంట్ వెరిఫికేష‌న్ బ్యాగ్రౌండ్ వెరిఫికేష‌న్ ఫైన‌ల్ పేమెంట్ ఫీజుల రూపంలో ఎనిమిది ద‌శ‌ల్లో బాధితుల నుంచి డ‌బ్బులు గుంజేవారు. అంద‌మైన అమ్మాయిల‌ను కేట‌గిరీగా విభ‌జించి సిల్వ‌ర్‌, గోల్డ్‌, ప్లాటినం ఫీజుల‌ను వ‌సూలు చేసేవారు.

హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అంతే, అక్క‌డ్నుంచి మొద‌లైంది అస‌లు క‌థ‌. అత‌నికి ఓ అమ్మాయి నుంచి ఫోన్ వ‌చ్చింది. స‌భ్య‌త్వం కింద రూ.1,050లు చెల్లించాల‌ని చెప్పింది. దాంతో, ఆ వ్య‌క్తి ఆమె సూచించిన బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో న‌గ‌దును జ‌మ చేశాడు. త‌రువాత నుంచి వ‌సూళ్ల ప‌రంప‌ర మొద‌లైంది.

ఏదో ఒక పేరుతో అత‌న్ని పీల్చి పిప్పి చేశారు. దాదాపు రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు గుంజేశారు. ఎంత ప‌క్కాగా అంటే. అందులో, జీఎస్టీ కింద రూ.90 వేలు వ‌సూలు చేశారు. చివ‌రికి ఓ రోజున అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ కావ‌డంతో తాను మోస‌పోయిన‌ట్టు భావించిన ఆ వ్య‌క్తి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

అత‌ని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు షాక్ ఇచ్చే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సాంకేతిక ఆధారాల‌తోపాటు బ్యాంక్ ఖాతాల వివ‌రాల ఆధారంగా ప‌శ్చిమ బెంగాల్ నుంచి ఆ ముఠా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న‌ట్టు గుర్తించారు. ముఠా సూత్ర‌ధారి దేవిశిష్‌ ముఖ‌ర్జీ అని తేలింది.

యువ‌కుల‌కు ఎస్కార్ట్స్ స‌ర్వీసెస్‌పై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాల‌నుకుని రెండున్న‌రేళ్ల క్రితం www.worlddating.com ను ప్రారంభించారు. దేవి శ్రీ స్నేహితురాలు అనిత కూడా స‌హ‌క‌రించ‌డంతో పెస్ట్ కంట్రోల్ దుకాణం ముసుగులో ఓ కాల్ సెంట‌ర్‌ను ప్రారంభించారు. మూడు కొత్త వెబ్‌సైట్స్‌ను ప్రారంభించ‌డ‌మే కాకుండా సిలుగురిలో 12 బ్రాంచ్‌లు, కోల్‌క‌తాలో ఎనిమిది బ్రాంచ్‌లు ప్రారంభించారు. 400 మంది ఉద్యోగుల‌తో కాల్స్ చేస్తూ డ‌బ్బులు దండుకున్నారు. ఫీమేల్ ఎస్కార్ట్ పేరిట సోష‌ల్ మీడియాలో నెంబ‌ర్ల‌ను పోస్ట్ చేశారు. ఆ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించిన వారితో ద‌శ‌ల వారీగా కంపెనీ బ్యాంక్ ఖాతాలో జ‌మ చేయించే వారు. రోజుకు ఒక్కో కాల్ సెంట‌ర్ నుంచి 200 ఫోన్ క‌ల్స్ చేస్తూ నెల‌కు. రూ.600 కోట్ల చొప్పున దండుకున్నారు.