మైత్రీవనం మెట్రోస్టేషన్ పై నుండి దూకి యువకుడు ఆత్మహత్య.. !

84
hyd ameer peta, metro
hyd ameer peta, metro

హైదరాబాద్ లోని మైత్రీవనం మెట్రో స్టేషన్ పై నుంచి సారధి స్టూడియోస్ వైపునకు దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు ఓ యువకుడు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మరణించి నట్లు తెలిపారు.. కాగా ఇంకా మతుడి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.. కాగా మెట్రో స్టేషన్ లో ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మొదటి సారి కాదు.. గత వారం కూడా కొత్తపేటలోని విక్టోరియా మొమోరియల్ మెట్రోస్టేషన్ నుంచి దూకేసింది. కాగా గాయాలతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది..

కాగా ఈలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని పోలీసులు మెట్రో అధికారులను హెచ్చరించారు.. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు.. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ప్రశ్నాగా మిగిలిందని చెప్పవచ్చు..