బ్రహ్మస్త్ర టైటిల్ లోగోని విడుదల చేసిన రాజమౌళి

0

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ క్యాంబోలో రూపుదిద్దుకుంటున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్ , రణ్ బీర్ కపూర్, అక్కినేని నాగార్జున, అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. భారత దేశంలో మొట్టమొదటి మైథలాజికల్ ఫ్యూజ‌న్ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది.ఇటీవల ప్రయాగలోని కుంభమేళాలో చిత్ర లోగోను 150 డ్రోన్‌ల సాయంతో ఆకాశంలో ఆవిష్కరించారు.

ఇప్పుడు తాజాగా తెలుగు, తమిళ లోగోలను విడుదల చేశారు.తాజాగా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. బ్రహ్మాస్త్ర’ లోగోను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా రాజమౌళి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25న హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలవుతుంది.