కరోనా పేరు మారింది – ఇక నుండి కచ్చితంగా ఇలానే పిలవాలి

154

ప్రస్తుతం ప్రపంచాన్ని, ముఖ్యంగా చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ పేరును మారుస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది . వేల మందికి వ్యాపిస్తూ, ఇప్పటి వరకు వందల మందిని బలిగొన్న కరోనా వైరస్ కు ఇప్పటి వరకు అధికారికంగా పేరు అంటూ ఏమి లేదు . మొదట్లో కరోనా అని పిలవడం మొదలవడంతో అదే పేరుతో అందరూ పిలవడం అలవాటు చేసుకున్నారు .

ఇక కరోనా పేరుతో కొన్ని అపోహలు, అనుమానాలు ఉండటంతో అధికారికంగా కోవిడ్- 2019 అనే పేరును ప్రకటించింది. ఇక నుండి ప్రతి ఒక్కరు తప్పని సరిగా కరోనాను కోవిడ్ -2019 పిలవాలని వెల్లడించింది.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అదానోమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాకు మేము కోవిడ్-19గా పేరును నిర్ణయించాం. కోవిడ్‌ పూర్తి పేరు C– corona, V– virus, D– disease2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగో ళాన్ని తొలగించేం దుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు…