క్రిస్మస్ కోసం స్పెషల్ గా చేసుకొనే బిర్యానీ ఏంటో తెలుసా..

32

క్రెస్తవులు జరుపుకొనే ఏకైక పండుగ క్రిస్టమస్.. ఈ పండుగను ప్రతి ఏడాది డిసెంబర్ 25 న జరుపుకుంటారు. అయితే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగనాడు క్రిస్టియన్స్ ఎన్నో రకాల స్వీట్లను, గుమగుమలాడే బిర్యానీలను వండుతారు. ముఖ్యంగా కోప్తాలతో చేసే బిర్యానీ ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇంకా ఆలస్యమెందుకు ఆ బిర్యానీకి ఎలా చేసుకుంటే మరింత తెలుసుకుందాము..

కావలసిన పదార్థాలు:

కోప్తాలకోసం చికెన్ లేదా మటన్ : అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ : మూడు స్పూన్లు
కొత్తిమీర తరుగు : అరకప్పు
గరంమసాలా : రెండు స్పూన్లు
టమోటా కెచప్ : రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత
బాస్మతి బియ్యం : రెండు కప్పులు

గ్రేవీ కోసం :

టమోటాలు : మూడు, జీలకర్ర , కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాలపొడి అన్ని కొద్దిగా తీసుకోవాలి. పసుపు : కొద్దిగా, నూనె : అరకప్పు

తయారీ విధానం :

ముందుగా నాలుగు కప్పుల వేడి నీటిలో బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక అరగంటసేపు నానపెట్టాలి. ఆ తర్వాత అన్నాన్ని నీళ్లలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో పక్క ఫాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసి వేడి అయ్యాక, అల్లం వెల్లులి పేస్ట్ వేసి, ధనియాలపొడి కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. కాస్త వేగనిచ్చి టమోటా ముక్కలు వేసుకొని మూత పెట్టాలి. కప్పు గోరువెచ్చని నీళ్లు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న కోప్తా బాల్స్ అందులో వేసుకోవాలి. అలా కోప్తా ఉండలు ఉడికాయనుకున్నాక దించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అడుగున నూనె రాసి ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. మసాలా వేసి పొరలాగా వేసుకోవాలి మళ్ళి అన్నాన్ని వేసుకోవాలి . పొయ్యి మీద ఫాన్ పెట్టి దానిపై ఈ గిన్నె పెట్టి అరగంట ఉంచాలి అంతే ఎంతో రుచుకరమైన కోప్తా బిర్యానీ రెడీ.. హ్యాపీ క్రిస్మస్ …